Nara Lokesh: ఏపీ ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ లో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందంటూ సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ

Lokesh wrote CM Jagan over AP EAPCET Counselling
  • విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడేయొద్దని హితవు
  • సాంకేతిక లోపాలు పరిష్కరించాలని సూచన
  • యూజర్ ఫ్రెండ్లీ విధానాలు అవసరమని వ్యాఖ్య 
  • విధివిధానాలు సంస్కరించాలంటూ లేఖ

ఎంసెట్ కు బదులుగా ఏపీలో నిర్వహిస్తున్న ఈఏపీ సెట్ లో విద్యార్థుల అడ్మిషన్ కౌన్సెలింగ్ లో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ కు లేఖ రాశారు. సాంకేతిక సమస్యలు, అసంబద్ధ విధానాలతో విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేయడం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వ కోటా సీట్లు (కన్వీనర్, స్పోర్ట్స్, ఎన్సీసీ) భర్తీ అయ్యేలా బాధిత విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

సాంకేతిక లోపాలు లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాకు అనుగుణంగా వెబ్ సైట్ ను అప్ డేట్ చేయాలని స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను ఏ విధంగా వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోందో తప్పనిసరిగా వివరించాలని సూచించారు. విద్యార్థుల సమస్యలపై మరింతగా ప్రతిస్పందించేలా, సమస్యలు నివేదించే విద్యార్థుల పట్ల యూజర్ ఫ్రెండ్లీ తరహాలో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విధివిధానాలను, ప్రోటోకాల్స్ ను సంస్కరించాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News