Perni Nani: నెల్లూరు జిల్లా రవాణా శాఖ అవకతవకలపై దర్యాప్తుకు మంత్రి పేర్ని నాని ఆదేశాలు

Perni Nani orders probe on irregularities in Nellore district transport authorities
  • ఈశాన్య రాష్ట్రాల వాహనాలకు నెల్లూరు జిల్లాలో రిజిస్ట్రేషన్లు
  • సూళ్లూరుపేట ఎంవీఐ గోపీనాయక్ పై వేటు
  • గూడూరు ఆర్టీవోను ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేసిన సర్కారు
ఈశాన్య రాష్ట్రాల వాహనాల (ట్యాంకర్లు)కు నెల్లూరు జిల్లాలో రిజిస్ట్రేషన్లు జరుగుతుండడం పట్ల ఏపీ ప్రభుత్వం స్పందించింది. నెల్లూరు జిల్లా రవాణా అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సూళ్లూరుపేట మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ (ఎంవీఐ) గోపీనాయక్ ను సస్పెండ్ చేసింది. గూడూరు ఆర్టీవో మల్లికార్జునరెడ్డిని ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆదేశించారు. విచారణ అధికారిగా పశ్చిమ గోదావరి జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆనంద్ ను నియమించారు.
Perni Nani
Probe
Transport Authorities
Nellore District

More Telugu News