Jagan: బ‌ర్త్ డే కేక్ కోసిన ఏపీ సీఎం జ‌గ‌న్‌

jagan celebrates birth day
  • వేదపండితుల ఆశీర్వచ‌నం
  • శ్రీవారి ప్రసాదం అందజేత‌
  • సీఎంను క‌లిసిన‌ మంత్రులు, ఎంపీలు
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు జ‌రిగాయి. ప‌లువురు నేత‌ల స‌మక్షంలో సీఎం జగన్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. అనంతరం ఆయ‌న‌కు శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రులు, ఎంపీలు, సీఎస్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.  
                  
మరోపక్క, జగన్‌ జన్మదిన వేడుకను ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. జ‌గ‌న్‌కు ప‌లువురు ప్ర‌ముఖులు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, బాలినేని, కొడాలి నాని, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్ష‌లు చెప్పారు.  

  
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News