Amit Malaviya: 'ఆకతాయి' అనే పేరును రాహుల్ గాంధీ సార్థకం చేసుకుంటున్నారు: బీజేపీ నేత అమిత్ మాలవీయ

BJP leader Amit Malaviya slams on Rahul Gandhi
  • సభలో పరిణామాలపై రాహుల్ ను ప్రశ్నించిన పాత్రికేయుడు
  • ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నావా అంటూ రాహుల్ ఆగ్రహం
  • స్పందించిన బీజేపీ నేత మాలవీయ
  • రాహుల్ కు చర్చించేంత సమర్థత లేదని విమర్శలు
పార్లమెంటులో పరిణామాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నావా? అంటూ ఆ పాత్రికేయుడ్ని పదేపదే ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రాహుల్ పంచుకున్నారు. సభను సజావుగా నడపడం విపక్షాలకు చెందిన అంశం కాదని, ప్రభుత్వం విధి అని స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ నేత అమిత్ మాలవీయ తీవ్రంగా స్పందించారు.

'ఆకతాయి' అనే పేరును రాహుల్ సార్థకం చేసుకుంటున్నారని విమర్శించారు. పార్లమెంటులో విపక్షాల గందరగోళంపై ప్రశ్నించిన పాత్రికేయుడిపై రాహుల్ విరుచుకుపడ్డారని అన్నారు. "వివిధ అంశాలపై చర్చకు రావాలంటూ విపక్షాలను ప్రభుత్వం కోరుతోంది. కానీ కాంగ్రెస్ ముందుకు రావడంలేదు. కాంగ్రెస్ పార్టీకి గానీ, రాహుల్ గాంధీకి గానీ చర్చించేంత సమర్థత లేదు. అందుకే సభలో అల్లరి చేస్తున్నారు" అంటూ మాలవీయ ట్వీట్ చేశారు.
Amit Malaviya
Rahul Gandhi
Entitled Brat
BJP
Congress

More Telugu News