Kodali Nani: మేం ఏం చేయాలో చెప్పడానికి నువ్వేమీ మా వ్యూహకర్తవి కాదు: పవన్ కల్యాణ్ పై కొడాలి నాని ఫైర్

Kodali Nani fires in Pawan Kalyan
  • స్టీల్ ప్లాంట్ అంశంలో జనసేన వర్సెస్ వైసీపీ
  • వైసీపీ ఎంపీలు కనీసం ప్లకార్డులైనా పట్టుకోవడంలేదన్న పవన్
  • పవన్ ఓ రాజకీయ అజ్ఞాని అంటూ కొడాలి నాని విమర్శలు
  • పవన్ సలహాలు ఎవరికి కావాలంటూ ఆగ్రహం

ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సలహాలు తమకు అవసరంలేదన్నారు.

ప్రాణత్యాగాలు చేసైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నేతలు చెప్పారని, వారు అంత త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని, కనీసం ప్లకార్డులు పట్టుకుంటే చాలని పవన్ నేడు వ్యాఖ్యానించారు.

పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కొడాలి నాని... స్టీల్ ప్లాంట్ అంశంలో ఏం చేయాలో చెప్పడానికి పవన్ కల్యాణ్ ఏమీ తమ వ్యూహకర్త కాదని అన్నారు. తమకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ఉన్నారని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ ఆ సలహాలేవో దత్తత తండ్రి చంద్రబాబుకో, లేక బీజేపీకో ఇచ్చుకోవాలని సూచించారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో తాము చేసేది చేస్తామని, అసలు పవన్ కల్యాణ్ ఏంచేస్తాడో చెప్పాలని కొడాలి నాని నిలదీశారు. అయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాల్సిన బాధ్యత కేంద్రానిదని, పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తే ప్రైవేటీకరణ ఆగిపోతుందా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వంటి రాజకీయ అజ్ఞాని ఇచ్చే సలహాలు ఎవరికి కావాలని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News