Saitej: పక్కా మాస్ మూవీకి రెడీగా సాయితేజ్!

Saitej in Sampath Nandi Movie
  • మాస్ హీరోయిజంపై సాయితేజ్ దృష్టి
  • సంపత్ నందికి గ్రీన్ సిగ్నల్
  • రచ్చ .. బెంగాల్ టైగర్ సినిమాలతో మెప్పించిన దర్శకుడు
  • వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి  
సాయితేజ్ మొదటి నుంచి కూడా యూత్ ను ఎక్కువగా ఆకట్టుకునే కథలను చేస్తూ వస్తున్నాడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించగలిగాడు. అప్పుడప్పుడు అపజయాలు ఎదురైనా ఎప్పటికప్పుడు కొత్తగానే ట్రై చేస్తూ వెళ్లాడు. అయితే ఇంతవరకూ ఆయనకి సరైన సినిమా పడలేదనే వాళ్లు ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే సాయితేజ్ పూర్తిస్థాయిలో ఒక పక్కా మాస్ సినిమాను చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. 'రచ్చ' .. 'బెంగాల్ టైగర్' వంటి మాస్ సినిమాలతో హిట్స్ అందుకున్న సంపత్ నంది ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని చెప్పుకుంటున్నారు. మరి, తనలో ఉన్న మాస్ హీరోను తెరపై ఏ రేంజ్ లో సాయితేజ్ చూపిస్తాడో చూడాలి.
Saitej
Sampath Nandi
Tollywood

More Telugu News