Aiswarya Rai: పనామా పత్రాల లీకేజీ వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరైన ఐశ్వర్యారాయ్

Aiswarya Rai attends to ED trial in Panama papers issue
  • సంచలనం సృష్టించిన పనామా పత్రాల వ్యవహారం
  • పనామా పత్రాల్లో అమితాబ్, ఐశ్వర్యల పేర్లు
  • నేడు విచారణకు రాలేనన్న ఐశ్వర్య
  • అనూహ్య రీతిలో ఈడీ ఆఫీసు వద్ద ప్రత్యక్షం
సంచలనం సృష్టించిన పనామా పత్రాల లీకేజీ వ్యవహారంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ విచారణకు హాజరయ్యారు. పనామా పత్రాల వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతుండడం తెలిసిందే.

ఈ క్రమంలో విచారణకు రావాలంటూ ఐశ్వర్యారాయ్ కి ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఇవాళ తాను విచారణకు రాలేనంటూ ఐశ్వర్య బదులిచ్చింది. అయితే అంతలోనే ఢిల్లీలోని జామ్ నగర్ హౌస్ లో ఉన్న ఈడీ కార్యాలయం వద్ద అనూహ్యరీతిలో ఐశ్వర్యారాయ్ ప్రత్యక్షమైంది. దాంతో ఆమెను విచారించేందుకు ఈడీ అధికారులు సంసిద్ధులయ్యారు.

పనామా న్యాయ సేవల సంస్థ మొసాక్ ఫోన్సెకాకు చెందిన పేపర్లు లీక్ కాగా, అందులో భారత్ కు చెందినవారివే 12 వేల పత్రాలు ఉన్నట్టు వెల్లడైంది. ఈ పేపర్లలో అనేకమంది భారత వ్యాపార రంగ ప్రముఖులతో పాటు బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబీకుల పేర్లు కూడా ఉన్నట్టు తెలిసింది. దాంతో వారికి ఈడీ సమన్లు జారీ చేసింది.
Aiswarya Rai
ED
Panama Papers
Amitabh Bachchan
Bollywood
India

More Telugu News