Sharmila: ఈ రైతు మరణానికి ప్రభుత్వమే కారణం: ష‌ర్మిల‌

sharmila slams kcr
  • రైతు ఆవేద‌న యాత్రలో ష‌ర్మిల‌
  • ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప‌రామ‌ర్శ‌
  • ఓ వైపు రైతులను చంపుకుంటూ మరోవైపు ధర్నాలు అంటూ విమ‌ర్శ‌
వైఎస్సార్ తెలంగాణ‌ పార్టీ అధినేత్రి ష‌ర్మిల రైతు ఆవేద‌న యాత్ర ప్రారంభించారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల కుటుంబాల‌ను ఆమె ప‌రామ‌ర్శిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అద్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుమ్మరి రాజయ్యకు ష‌ర్మిల‌ నివాళులు అర్పించారు.  

అనంత‌రం, వడ్లు కొనుగోళ్లు లేక‌పోవ‌డంతో ఆత్మహత్య చేసుకున్న రైతు మున్నారు యాదయ్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన‌ట్లు వైఎస్ ష‌ర్మిల ట్విట్ట‌ర్ లో తెలిపారు. ఈ రైతు మరణానికి ప్రభుత్వమే కారణమ‌ని ఆమె విమ‌ర్శించారు. ఓ వైపు రైతులను చంపుకుంటూ, మరోవైపు ధర్నాలు చేయడం సిగ్గు చేటని ఆమె అన్నారు.
Sharmila
TRS
Telangana

More Telugu News