Manas: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే నుంచి మానస్ ఎలిమినేట్

Manas eliminated from Bigg Boss Show Grand Finale
  • చివరిదశలో బిగ్ బాస్ షో
  • గ్రాండ్ ఫినాలే నుంచి సిరి, మానస్ అవుట్
  • హౌస్ లో మిగిలిన సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే సిరి ఎలిమినేట్ కాగా, అదే బాటలో మానస్ కూడా బయటికి వచ్చాడు. కంటెస్టెంట్లకు డబ్బు ఆఫర్ చేసేందుకు శ్యామ్ సింగరాయ్ టీమ్ నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి, కృతి శెట్టి బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ బాక్స్ లో ఎంత డబ్బు ఉందో తనకు తెలియదని, బిగ్ బాస్ ఇంటి నుంచి స్వచ్ఛందంగా బయటికి వచ్చేట్టయితే ఆ బాక్స్ లో ఉన్న డబ్బంతా వారి సొంతం అవుతుందని నాని ఆఫర్ ఇచ్చాడు. అయితే హౌస్ లోని నలుగురు కంటెస్టెంట్లు సన్నీ, మానస్, షణ్ముఖ్, శ్రీరామచంద్ర ఎవరూ ఆ ఆఫర్ కు ఆసక్తి చూపలేదు.

ఇక చివరగా నలుగురి బొమ్మలు ఓ వేదికపై వేలాడదీశారు. లీవర్ లాగినప్పుడు ఎవరి బొమ్మ కిందపడిపోతుందో వారు ఎలిమినేట్ అవుతారని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఇందులో మానస్ బొమ్మ పడిపోవడంతో అతడు ఎలిమినేట్ అయినట్టు నాగ్ నిర్ధారించారు.
Manas
Elimination
Bigg Boss-5
Grand Finale

More Telugu News