Pothina Mahesh: రఘురామకృష్ణరాజు దగ్గరకు వెళ్లండి.. పోరాటం ఎలా చేయాలో నేర్పుతారు: వైసీపీ ఎంపీలకు పోతిన మహేశ్ సూచన

Pothina Mahesh suggests YSRCP MPs to learn fighting spirit from Raghu Rama Krishna Raju
  • ప్రజల మంచి కోసం పని చేయాలి
  • ఏ ఒక్కరి మెప్పు కోసమో పని చేయకూడదు
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో పోరాడాలి
జనసేన నేత పోతిన మహేశ్ వైసీపీ ఎంపీలపై మండిపడ్డారు. మనమంతా ప్రజల కోసం పని చేయాలని... ఏ ఒక్కరి మెప్పు కోసమో పని చేయకూడదని అన్నారు. వైసీపీ ఎంపీలందరూ ఇప్పటికైనా మేల్కొనాలని... విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంటులో గళం విప్పాలని చెప్పారు. ఢిల్లీలో చలికి రగ్గులు కప్పుకుని పడుకోవద్దని ఎద్దేవా చేశారు. మీ ఎంపీ రఘురామకృష్ణరాజు దగ్గరకు వెళ్తే పోరాటం ఎలా చేయాలో చెబుతారని వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపీలందరూ ఢిల్లీలో పోరాడాలని సూచించారు.
Pothina Mahesh
Janasena
Raghu Rama Krishna Raju
ysrcp

More Telugu News