Adivi Sesh: పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది: అడివి శేష్

Adivi Sesh movies update
  • విభిన్నమైన కథల పట్ల ఆసక్తి 
  • హీరోగా పెరుగుతూ వెళుతున్న క్రేజ్ 
  • ఫిబ్రవరి 11న రానున్న 'మేజర్'
  • సెట్స్ పై 'హిట్ 2'     
మొదటి నుంచి కూడా అడివి శేష్ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. 'క్షణం' .. 'గూఢచారి' .. 'ఎవరు' సినిమాలు ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మేజర్' రెడీ అవుతుండగా, 'హిట్ 2' సెట్స్ పైకి వెళుతోంది.

నిన్న ఆయన తన 36వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "మా ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని ఎప్పటి నుంచో పోరుతున్నారు. కొన్నాళ్లు గట్టిగా చెప్పారు .. ఆ తరువాత తిట్టారు .. ఇక వీడికి చెప్పడం మన వల్ల కాదనుకుని వదిలేశారు. కానీ ఈ మధ్యనే నాకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉండాలి కదా అనిపిస్తోంది. అంటే ఒక రకంగా పెళ్లి మీదకి గాలి మళ్లిందనే చెప్పాలి" అన్నాడు.

అంటే వచ్చే ఏడాదిలో పెళ్లి ప్రయత్నాలు మరింత గట్టిగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీన విడుదలవుతున్న 'మేజర్' తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో ఆయన ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
Adivi Sesh
Major Movie
HIT Movie

More Telugu News