Congress: చివరి నిమిషంలో డీఎస్ ఢిల్లీ పర్యటన వాయిదా.. కాంగ్రెస్‌లో చేరికకు నెల రోజుల బ్రేక్!

TRS leader DS Postponement of joining the Congress
  • ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్
  • ఫిరాయింపు చట్టం ఇబ్బందుల్లేకుండా చూసుకుంటున్న కాంగ్రెస్
  • సంక్రాంతి తర్వాత పార్టీలో చేర్చుకునే యోచన
టీపీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరిక వాయిదా పడింది. డీఎస్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవీకాలం మరో ఆరు నెలలకుగాపైగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక పార్టీ మారితే ఫిరాయింపు చట్టం వర్తించే అవకాశం ఉంది. దీంతో ఆ ఇబ్బంది లేకుండా సంక్రాంతి తర్వాతనే ఆయనను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

నిజానికి ఆయన నిన్ననే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సింది. అయితే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అందిన ఆదేశాలతో చివరి నిమిషంలో డీఎస్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు రావాలో చెబుతామని, అప్పటి వరకు వేచి ఉండమని చెప్పినట్టు తెలుస్తోంది.
Congress
DS
Telangana
TRS

More Telugu News