Amaravati: తిరుపతిలో రాజధాని రైతుల సభకు ఎవరెవరు వచ్చారంటే..!

Amaravati farmers conducts huge rally in Tirupati
  • అమరావతి కోసం రైతుల పాదయాత్ర
  • తిరుపతిలో ముగిసిన పాదయాత్ర
  • నేడు భారీ సభ
  • కాసేపట్లో చంద్రబాబు రాక
అమరావతి ఒక్కటే ఏపీ రాజధాని అంటూ న్యాయస్థానం టు దేవస్థానం పేరిట మహాపాదయాత్ర నిర్వహించిన రైతులు నేడు తిరుపతిలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సీపీఎం నేతలు తప్ప మిగిలిన అన్ని విపక్షాల నేతలు హాజరవుతున్నారు.

ఇప్పటివరకు ఈ సభకు విచ్చేసినవారిలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పరిటాల సునీత, గౌతు శిరీష, సినీ నటుడు శివాజీ, పాతూరి నాగభూషణం, బీజేపీ, జనసేన ప్రతినిధులు ఉన్నారు. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా విచ్చేయనున్నారు. ఈ సభ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.
Amaravati
Farmers
Rally
Tirupati
AP Capital
Andhra Pradesh

More Telugu News