Balakrishna: బాలకృష్ణ నెక్స్ట్ మూవీ టైటిల్ గా 'వేటపాలెం'

Balakrishna in Gopichand Malineni movie
  • 'అఖండ'తో దక్కిన సంచలన విజయం
  • నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేనితో
  • కథానాయికగా శ్రుతి హాసన్
  • నెగెటివ్ రోల్ లో వరలక్ష్మి శరత్ కుమార్  
  • జనవరి 20 నుంచి రెగ్యులర్ షూటింగ్

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాలకృష్ణ అభిమానులంతా ఆ సందడిలో ఉండగానే ఆయన తదుపరి సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. బాలకృష్ణ తన నెక్స్ట్ మూవీని గోపీచంద్ మలినేనితో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'వేటపాలెం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట.  

ఈ కథ రాయలసీమ నేపథ్యంలో సాగనుంది. తండ్రీకొడుకులుగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారని అంటున్నారు. ఒక పాత్రలో ఫ్యాక్షన్ లీడర్ గాను .. మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్ గాను ఆయన కనిపించనున్నారని చెబుతున్నారు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, జనవరి 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.

బాలకృష్ణ సరసన నాయికగా శ్రుతిహాసన్ అందాల సందడి చేయనుంది. మరో కథానాయికగా భావనను తీసుకున్నారట. ఇక నెగెటివ్ షేడ్స్ కలిగిన పవర్ఫుల్ లేడీ పాత్రను వరలక్ష్మీ శరత్ కుమార్ పోషించనుంది. ఇంతకుముందు గోపీచంద్ మలినేని చేసిన 'క్రాక్' సినిమాలో ఆమె పాత్రకి ఒక రేంజ్ లో క్రేజ్ లభించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News