Anushka Sharma: ప్లీజ్.. వామికా ఫొటోలు తీయొద్దు: ఫొటోగ్రాఫర్లకు కోహ్లీ విజ్ఞప్తి

Anushka Sharma holds Vamika close Kohli requests paps to not click pics
  • సౌతాఫ్రికా పర్యటనకు కోహ్లీ సేన
  • విమానాశ్రయంలో వామిక ఫొటోలు తీసే యత్నం
  • వద్దని రిక్వెస్ట్ చేసిన కోహ్లీ వీడియో వైరల్
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు తమ గారాలపట్టి వామికను చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నారు. వామిక ఫొటోలను అప్పుడప్పుడు బయటకు విడుదల చేస్తున్నప్పటికీ ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. కొంత వయసు వచ్చే వరకు వామిక ఫొటోలను బయటకు చూపించకూడదని గతంలోనే చెప్పారు. దీంతో ఇప్పటి వరకు ఆ చిన్నారి ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశం అభిమానులకు లేకుండా పోయింది.

కోహ్లీ సారథ్యంలో భారత జట్టు మూడు టెస్టుల సిరీస్‌ కోసం నిన్న దక్షిణాఫ్రికా బయలుదేరింది. ఈ సందర్భంగా ముంబై ఎయిర్‌పోర్టు వద్ద ఎదురుచూస్తున్న వీడియోగ్రాఫర్లు వామిక ఫొటోను తీసేందుకు ప్రయత్నించగా కోహ్లీ వారించాడు. పాప ఫొటోలు తీయొద్దని వారిని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది.
Anushka Sharma
Vamika
Virat Kohli

More Telugu News