Etela Rajender: బండి సంజయ్‌తో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఈటల రాజేందర్

will contest against kcr if party High command said
  • ఆ ప్రచారం కేసీఆరే చేయిస్తున్నారు
  • పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేస్తా
  • మద్యం ఆదాయం ప్రభుత్వానికి మంచిది కాదు
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో పాల్గొన్న ఈటల పలు అంశాలపై మాట్లాడారు. ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు ప్రభుత్వం ఏకంగా రూ. 600 కోట్లు ఖర్చు చేసిందని, ఆ సొమ్ము ఎక్కడిదో చెప్పాలని డిమాండ్ చేశారు.

పార్టీ కనుక ఆదేశిస్తే కేసీఆర్‌పైనా పోటీ చేస్తానని అన్నారు. తాను కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటానంటూ జరుగుతున్న ప్రచారం కేసీఆర్ చేయిస్తున్నదేనని ఆరోపించారు. టీఆర్ఎస్‌లో భవిష్యత్తు లేదని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారని ఈటల అన్నారు. విచ్చలవిడి మద్యం అమ్మకాల కారణంగా ప్రభుత్వానికి రూ. 30 వేల కోట్ల ఆదాయం సమకూరుతోందని పేర్కొన్న ఈటల.. ఆడబిడ్డల తాళి బొట్లు తెగిపోతున్నాయని, మద్యం ఆదాయం ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు.
Etela Rajender
KCR
Telangana
TRS
BJP

More Telugu News