క్యాంపు కార్యాలయానికి రెండు బస్సుల్లో వచ్చిన ఐపీఎస్ అధికారులు... సీఎం జగన్ తో భేటీ

  • సీఎం జగన్ వరుస భేటీలు
  • ఐపీఎస్ అధికారులతో కొనసాగుతున్న సమావేశం
  • ఉద్యోగులతో ప్రభుత్వ చర్చలు వాయిదా
  • చర్చల మధ్యలోనే వెళ్లిపోయిన సీఎస్ సమీర్ శర్మ
ఏపీ సీఎం జగన్ తో రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులు సమావేశమయ్యారు. ఐపీఎస్ అధికారులు రెండు బస్సుల్లో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది.

అటు, ఏపీ సంఘాలతో ప్రభుత్వ చర్చలు వాయిదాపడ్డాయి. భేటీ అయిన కాసేపటికే సీఎంతో అత్యవసర సమావేశం ఉందంటూ సీఎస్ సమీర్ శర్మ వెళ్లిపోయారు. దాంతో చర్చలు అసంపూర్తిగా నిలిచిపోయాయి.

అంతకుముందు సీఎం జగన్ ను ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. దీనిపై కల్యాణ్ కృష్ణమూర్తి స్పందిస్తూ, ఏపీలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలపై తమ అభిప్రాయాలను సీఎంతో పంచుకున్నామని తెలిపారు. రైతులకు లబ్ది చేకూర్చే ప్రతిపాదనలను కూడా సీఎం ముందుంచామని వెల్లడించారు. సీఎం జగన్ తో సమావేశం ఫలప్రదంగా సాగిందని పేర్కొన్నారు.


CM Jagan
IPS Officers
Kalyan Krishnamurthy
Flipkart

More Telugu News