తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల విడుదల
- 2020-21 ఇంటర్ ఫస్టియర్ ఫలితాల వెల్లడి
- బాలికల్లో అత్యధిక ఉత్తీర్ణతా శాతం
- రీకౌంటింగ్, వెరిఫికేషన్ కు ఈ నెల 22 తుది గడువు
ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ ను tsbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్ సైట్లలో చూసుకోవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు వెల్లడించింది.
ఇక, రీకౌంటింగ్, వెరిఫికేషన్ కోరుకునేవారు ఈ నెల 22 లోపు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు తెలిపింది. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్ కు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని, స్కాన్ కాపీతో పాటు రీవెరిఫికేషన్ కోరుకునేవారు ఒక్కో పేపర్ కు రూ.600 చెల్లించాల్సి ఉంటుందని బోర్డు వివరించింది.