Soujanya Srinivas: 'మీనాక్షి కల్యాణం' నృత్యరూపకం ప్రదర్శించనున్న త్రివిక్రమ్ అర్ధాంగి... హాజరుకానున్న పవన్ కల్యాణ్

Trivikram Srinivas wife Soujanya to perform Meenakshi Kalyanam dance ballet
  • నాట్యకళాకారిణిగా త్రివిక్రమ్ భార్య సౌజన్యకు గుర్తింపు
  • పసుమర్తి రామలింగయ్య శాస్త్రి వద్ద శిష్యరికం
  • రేపు హైదరాబాదులో కార్యక్రమం
  • గతంలోనూ ప్రదర్శనలు ఇచ్చిన త్రివిక్రమ్ అర్ధాంగి

టాలీవుడ్ మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అర్ధాంగి సౌజన్య నాట్య కళాకారిణి అన్న విషయం తెలిసిందే. తాజాగా సౌజన్య శ్రీనివాస్ హైదరాబాదులో 'మీనాక్షి కల్యాణం' నృత్యరూపకం ప్రదర్శించనున్నారు. ఈ నెల 17న నగరంలోని శిల్పకళావేదికలో ఆమె నాట్య ప్రదర్శన జరగనుంది. సాయంత్రం 6 గంటలకు 'మీనాక్షి కల్యాణం' నృత్యరూపకం ప్రదర్శన ప్రారంభం కానుంది.

ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు పవన్ కల్యాణ్ కూడా హాజరవుతున్నారు. సౌజన్య శ్రీనివాస్ ప్రముఖ నాట్యగురువు పసుమర్తి రామలింగయ్య శాస్త్రి వద్ద శిష్యరికం చేశారు. ఆమె గతంలోనూ పలు ప్రదర్శనలు ఇచ్చారు.

  • Loading...

More Telugu News