GHMC: ఆ విషయాన్ని నిరూపించండి.. చెవి కోసుకుంటా: హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి

I am not keeping BJP corporators away says Hyderabad mayor Vijayalakshmi
  • బీజేపీ కార్పొరేటర్లను కలవడం లేదనే విషయాన్ని నిరూపించండి
  • అన్ని పార్టీల కార్పొరేటర్లకు నేను అందుబాటులో ఉన్నా
  • కార్పొరేటర్లు, అధికారుల మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నా
బీజేపీ కార్పొరేటర్లను హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై ఆమె స్పందిస్తూ అన్ని పార్టీల కార్పొరేటర్లకు తాను అందుబాటులో ఉన్నానని చెప్పారు. బీజేపీ కార్పొరేటర్లకు దూరంగా ఉన్నానని నిరూపిస్తే తన చెవి కోసుకుంటానని అన్నారు.

 మేయర్ ఛాంబర్ పై బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు దాడి చేయడంపై ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్లకు అందుబాటులో ఉండటం లేదని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని... అందుకే జోన్లవారీగా సమావేశాలను నిర్వహిస్తున్నానని చెప్పారు. కొర్పొరేటర్లు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించి వారి మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తానని అన్నారు. అందరినీ కలుపుకుని పోతానని చెప్పారు.
GHMC
Hyderabad
Mayor
Vijayalakshmi
BJP
TRS

More Telugu News