ఒమిక్రాన్ బాధితుల్లో రాత్రుళ్లు విపరీతంగా చెమట పోయడం ఒక లక్షణమట!
- ఒమిక్రాన్ బాధితుల్లో వాసన కోల్పోవడం ఉండదు
- కొవిడ్ లక్షణాలైన దగ్గు, జలుబు, గొంతు నొప్పి కూడా లేవు
- డెల్టా వేరియంట్‌కు భిన్నమైన లక్షణాలు
- వెల్లడించిన దక్షిణాఫ్రికా డాక్టర్
కొవిడ్ లక్షణాలైన దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరం వంటివి ఒమిక్రాన్ బాధితుల్లో లేవన్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, స్వల్పంగా జ్వరం, అలసట, గొంతులో దురద వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు వేరియంట్‌ను తొలుత గుర్తించిన డాక్టర్ ఏంజెలిక్ కాట్జీ వివరించారు. కొందరిలో మాత్రం రాత్రిపూట విపరీతంగా చెమటపట్టడం వంటి భిన్నమైన లక్షణం కనిపిస్తున్నట్టు చెప్పారు. అలాగే, ఈ వేరియంట్ సోకిన వారిలో వాసన కోల్పోయే లక్షణం కూడా లేదన్నారు.