Corona Virus: ఒమిక్రాన్ బాధితుల్లో రాత్రుళ్లు విపరీతంగా చెమట పోయడం ఒక లక్షణమట!

sweating at night is one of the omicron symptom
  • ఒమిక్రాన్ బాధితుల్లో వాసన కోల్పోవడం ఉండదు
  • కొవిడ్ లక్షణాలైన దగ్గు, జలుబు, గొంతు నొప్పి కూడా లేవు
  • డెల్టా వేరియంట్‌కు భిన్నమైన లక్షణాలు
  • వెల్లడించిన దక్షిణాఫ్రికా డాక్టర్

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టమైన వివరాలేమీ వెల్లడికాలేదు. దాని లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటాయని, కాబట్టి అది పరీక్షలకు కూడా అందదని ఇప్పటి వరకు వైద్య నిపుణులు ఇప్పటి వరకు చెప్పుకొచ్చారు. తాజాగా, దక్షిణాఫ్రికా డాక్టర్ ఒకరు ఒమిక్రాన్ లక్షణాలను వెల్లడించారు. ఈ వేరియంట్ సోకిన వ్యక్తుల్లో డెల్టాకు భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. దాని బారినపడిన వారు రాత్రుళ్లు విపరీతమైన చెమటతో బాధపడుతున్నట్టు గుర్తించామన్నారు.

కొవిడ్ లక్షణాలైన దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరం వంటివి ఒమిక్రాన్ బాధితుల్లో లేవన్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, స్వల్పంగా జ్వరం, అలసట, గొంతులో దురద వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు వేరియంట్‌ను తొలుత గుర్తించిన డాక్టర్ ఏంజెలిక్ కాట్జీ వివరించారు. కొందరిలో మాత్రం రాత్రిపూట విపరీతంగా చెమటపట్టడం వంటి భిన్నమైన లక్షణం కనిపిస్తున్నట్టు చెప్పారు. అలాగే, ఈ వేరియంట్ సోకిన వారిలో వాసన కోల్పోయే లక్షణం కూడా లేదన్నారు.

  • Loading...

More Telugu News