Allu Arjun: ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి: కన్నడ మీడియాతో అల్లు అర్జున్

Allu Arjun says sorry to media
  • ఈరోజు బెంగళూరులో 'పుష్ప' ప్రమోషన్ కార్యక్రమం
  • ప్రెస్ మీట్ కు లేట్ గా వెళ్లిన అల్లు అర్జున్
  • విమానం ల్యాండింగ్ సమస్యే కారణమన్న బన్నీ
కన్నడ మీడియా ప్రతినిధులకు అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారు. డిసెంబర్ 17న 'పుష్ప' సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.

ఈ క్రమంలో ఈరోజు బెంగళూరులో ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ప్రెస్ మీట్ కు లేటుగా వచ్చారంటూ ఓ జర్నలిస్టు అల్లు అర్జున్ పై అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 11.15 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పి... మీరు మధ్యాహ్నం 1.15 గంటలకు ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. దీంతో మీడియాకు బన్నీ క్షమాపణ చెప్పారు.

ఈరోజు బెంగళూరులో ప్రెస్ మీట్ ఉందనే విషయం తనకు తెలియదని... ఉదయం తనకు తెలిసిన వెంటనే ప్రైవేట్ జెట్ లో బయల్దేరి వచ్చానని అల్లు అర్జున్ తెలిపారు. అయితే మధ్యలో పొగమంచు కప్పేసిందని... ల్యాండింగ్ సమస్య కూడా వచ్చిందని... దీంతో లేట్ అయిందని చెప్పారు. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించాలని కోరారు. సారీ చెపితే మనిషి మరింత పెరుగుతాడే కానీ... తగ్గడని అన్నారు. మరోవైపు కన్నడ మీడియాపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ కన్నడ హీరోను ఇలాగే నిలదీయగలరా? అని ప్రశ్నిస్తున్నారు.
Allu Arjun
Tollywood
Pushpa
Bengaluru

More Telugu News