విరామం కావాలని కోహ్లీ మమ్మల్ని ఇంతవరకు కోరలేదు: బీసీసీఐ అధికారి
- దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు కోహ్లీ దూరం అంటూ వార్తలు
- దీనిపై తమకేమీ సమాచారం లేదన్న బోర్డు అధికారి
- కోహ్లీ వన్డే సిరీస్ లో ఆడుతున్నాడని వెల్లడి
"ఒకవేళ కోహ్లీ గాయంతో బాధపడుతుంటే అది వేరే విషయం. కానీ ఈ క్షణం వరకు మావద్ద ఉన్న సమాచారం మేరకు కోహ్లీ వచ్చే జనవరిలో 19, 21, 23 తేదీల్లో జరిగే వన్డేల్లో ఆడుతున్నాడు" అని ఆ అధికారి వెల్లడించారు. దక్షిణాఫ్రికా పర్యటనకు కోహ్లీ తన కుటుంబంతో వస్తున్నాడని, ఒకవేళ బయోబబుల్ కారణంగా అలసటకు గురయ్యానని భావిస్తే తప్పకుండా చీఫ్ సెలెక్టర్ కు గానీ, బోర్డు కార్యదర్శి, సెలెక్షన్ కమిటీ కన్వీనర్ (జై షా)కు గానీ సమాచారం అందిస్తాడని తెలిపారు.