Oldage Pension: వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్.. పింఛన్ పెంపు!

AP Govt increases Old Age pension
  • రూ. 2,225 నుంచి రూ. 2,500కు పింఛన్ పెంపు
  • జనవరి 1 నుంచి పెరగనున్న పింఛన్
  • ఈ నెల 21న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభం

ఏపీలోని అవ్వ, తాతలకు ముఖ్యమంత్రి జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. నెలనెలా ఇస్తున్న వృద్ధాప్యపు పింఛన్ ను పెంచుతున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న రూ. 2,225 పింఛన్ ను రూ. 2,500కు పెంచుతున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని చెప్పారు. జిల్లా కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వెల్లడించారు.
 
ఈ సందర్భంగా పలు వివరాలను జగన్ తెలిపారు. ఈ నెల 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 9న ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈబీసీ నేస్తం పథకం వల్ల అగ్రవర్ణ నిరుపేద మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. 45 నుంచి 60 ఏళ్ల వయసున్న నిరుపేద మహిళలకు మూడేళ్లలో రూ. 45 వేల చొప్పున ఆర్థికసాయం చేయనున్నారు. జనవరిలో రైతు భరోసా సాయాన్ని కూడా అందజేస్తామని చెప్పారు. అయితే రైతు భరోసా ఇచ్చే తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News