Narendra Modi: కాశీలో అర్ధ‌రాత్రి అక్క‌డి ప్రాంతాలను ప‌రిశీలించిన మోదీ.. వీడియో ఇదిగో

PM Modi holds late night inspection
  • రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో మోదీ
  • నిన్న‌ సాయంత్రం బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో భేటీ
  • అర్ధరాత్రి వరకూ కొన‌సాగిన వైనం
  • ఆ త‌ర్వాతా విశ్రాంతి తీసుకోని మోదీ
తన సొంత‌ నియోజకవర్గం వారణాసిలో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా త‌న క‌ల‌ల ప్రాజెక్టు ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ఆయ‌న నిన్న‌ ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో నిన్న ఉదయం నుంచి అక్క‌డి ఆల‌యాల‌ దర్శనాలు, పలు శంకుస్థాప‌న‌ల్లో మోదీ పాల్గొన్నారు. నిన్న‌ సాయంత్రం బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతోనూ స‌మావేశం అయ్యారు. ఈ సమావేశం అర్ధరాత్రి వరకూ కొన‌సాగ‌డం గ‌మ‌నార్హం.

అనంత‌రం కూడా మోదీ విశ్రాంతి తీసుకోలేదు. అర్ధరాత్రి దాటిన త‌ర్వాత మోదీ నగరంలో లేట్‌ నైట్‌ టూర్‌కు వెళ్లి అక్క‌డి ప్రాంతాల‌ను ప‌రిశీలించ‌డం గ‌మ‌నార్హం. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి కాశీ వీధుల్లో ఆయ‌న‌ నడిచారు. అక్కడ జ‌రుగుతోన్న ప‌లు ప్రాజెక్టుల‌ పనులను పరిశీలించారు. ఈ పవిత్ర నగరంలో ఉత్తమ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరింత కృషి చేస్తున్నామ‌ని మోదీ అన్నారు.
Narendra Modi
BJP
Uttar Pradesh

More Telugu News