మరో అరుదైన పదంతో బీజేపీని విమర్శించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
- బీజేపీ నాయకత్వం అలడొక్సోఫోబియాతో బాధపడుతోంది
- అందుకే చీటికిమాటికి ప్రజలపై రాజద్రోహం కేసులు
- ఈ పదానికి అర్ధాన్ని కూడా విడమరిచి చెప్పిన కాంగ్రెస్ ఎంపీ
ఇంగ్లిష్‌లో అత్యంత అరుదుగా ఉపయోగించే పదాల్లో ఇదొకటి. ‘అభిప్రాయాలంటే అహేతుక భయం’ అని ఈ పదానికి అర్థం. బీజేపీ ఇప్పుడు ఇదే భయంతో బాధపడుతోందని శశిథరూర్ విమర్శించారు. ‘వర్డ్ ఆఫ్ ది డే’గా దీనిని పేర్కొన్న ఆయన ‘అలడాక్సొఫోబియా’ పదానికి అర్ధాన్ని కూడా వివరించారు. ఈ పదానికి గ్రీకులో ఉన్న అర్ధం గురించి చెబుతూ.. అల్లో (allo)-విభిన్న, డొక్సో (doxo)- అభిప్రాయాలు, ఫోబోస్(phobos)- భయం అని విడమరిచి చెప్పారు.