Ramcharan: తోడల్లుడు అర్మాన్ ఇబ్రహీంతో రామ్ చరణ్... ఫొటోలు ఇవిగో!

Ram Charan with Armaan Ebrahim
  • ఈ నెల 8న పెళ్లిచేసుకున్న ఉపాసన సోదరి అనుష్పాల
  • చెన్నై కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంతో ప్రేమ పెళ్లి
  • కొత్త జంటతో ఉల్లాసంగా గడిపిన చరణ్-ఉపాసన జోడీ
ఇటీవల ఉపాసన సోదరి అనుష్పాల కూడా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఉపాసన... టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోగా, ఆమె సోదరి అనుష్పాల కూడా ప్రేమ వివాహం చేసుకుంది. ప్రఖ్యాత కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంను ఈ నెల 8న మనువాడింది. కాగా, పెళ్లి అనంతరం కొత్త జంటతో రామ్ చరణ్-ఉపాసన జోడీ ఉల్లాసంగా గడిపారు. తోడల్లుడు అర్మాన్ ఇబ్రహీంతో రామ్ చరణ్ ఆత్మీయ క్షణాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
Ramcharan
Anushpala Kamineni
Armaan Ebrahim
Upasana

More Telugu News