Nara Lokesh: టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: నారా లోకేశ్

Nara Lokesh condemns attack on TDP leader Thikka Reddy
  • కర్నూలు జిల్లాలో ఘటన
  • టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడి
  • గతంలోనూ రెండుసార్లు హత్యాయత్నం చేశారన్న లోకేశ్
  • తిక్కారెడ్డికి భద్రత కల్పించాలని డిమాండ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ నేతలపై మరోసారి ధ్వజమెత్తారు. జగన్ ప్రజాస్వామ్యాన్ని ఫ్యాక్షన్ కత్తికి బలిస్తున్నారని విమర్శించారు. కర్నూలు జిల్లాలో జాతరకు హాజరైన టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై వైసీపీ ఫ్యాక్షన్ మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయని ఆరోపించారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు.

గతంలోనూ తిక్కారెడ్డిపై రెండుసార్లు హత్యాయత్నం జరిగిందని, కానీ పోలీసులు కనీస భద్రత కల్పించకపోవడం పలు అనుమానాలు కలిగిస్తోందని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, టీడీపీ నేత తిక్కారెడ్డికి భద్రత కల్పించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. కత్తిని నమ్ముకున్నవాడు కత్తికి బలవ్వక తప్పదని చరిత్ర చెబుతోందని, ఈ సత్యాన్ని వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.

ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ప్రతిపక్ష నేతలను హతమార్చడానికా? అంటూ సీఎం జగన్ పై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా ఉండాల్సిన మీరు ఫ్యాక్షన్ రాజకీయాలను వదులుకోకపోవడం మీలోని మానసిక రుగ్మతను బయటపెడుతోందని వ్యాఖ్యానించారు.
Nara Lokesh
Thikka Reddy
TDP
Kurnool District
CM Jagan

More Telugu News