David Warner: 'పుష్ప రాజ్' లా మారిపోయిన వార్నర్... స్పందించిన అల్లు అర్జున్, కోహ్లీ

David Warner featuring Pushpa
  • స్పూఫ్ వీడియో చేసిన వార్నర్
  • ఫేస్ స్వాప్ టెక్నాలజీతో పుష్పలా మారిపోయిన వైనం
  • ఇన్ స్టాగ్రామ్ లో వీడియో
  • "తగ్గేదే లే" అంటూ బన్నీ కామెంట్
ఆస్ట్రేలియా విధ్వంసక క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు టాలీవుడ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ హీరోలను అనుకరిస్తూ వార్నర్ చేసే స్పూఫ్ వీడియోలు అభిమానులను విశేషంగా అలరిస్తుంటాయి. తాజాగా అల్లు అర్జున్ పుష్ప తరహాలో వార్నర్ ఓ వీడియోను పంచుకున్నాడు. దాంట్లో బన్నీ ముఖాన్ని వార్నర్ తన ముఖంతో స్వాప్ చేశాడు. తద్వారా వార్నర్ కాస్తా 'పుష్ప రాజ్' లా తయారయ్యాడు.

వార్నర్ తాజా వీడియోపై అల్లు అర్జున్ స్పందించాడు. "మై బ్రదర్ వార్నర్... తగ్గేదే లే!" అంటూ రిప్లయ్ ఇచ్చాడు. అటు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ, "మిత్రమా... నీకేం కాలేదు కదా!" అంటూ ఛలోక్తి విసిరాడు. ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ అయితే..  "ఇక చాలు ఆపేయ్" అంటూ వార్నర్ కు సలహా ఇచ్చాడు. మొత్తానికి వార్నర్ తన తాజా వీడియోతో అభిమానులనే కాదు సెలబ్రిటీలను కూడా ఆకర్షించాడు.
David Warner
Pushpa Raj
Video
Allu Arjun
Virat Kohli

More Telugu News