Aditi Shankar: వైద్య విద్య పట్టా అందుకున్న తమిళ సినీ దర్శకుడు శంకర్ కుమార్తె

Director Shankar daughter Aditi takes doctor degree
  • శ్రీ రామచంద్ర ఇన్ స్టిట్యూట్ లో మెడిసిన్ చదివిన అదితి
  • గత రాత్రి స్నాతకోత్సవం
  • సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్న అదితి
  • 'విరుమాన్' చిత్రంలో కార్తీ సరసన అరంగేట్రం
దక్షిణాది అగ్రశ్రేణి దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ ఇప్పుడు అధికారికంగా డాక్టర్ అయింది. ఆమె తాజాగా వైద్య విద్య పట్టా అందుకుంది. తమిళనాడులోని శ్రీ రామచంద్ర వైద్య కళాశాలలో అదితి వైద్య విద్య అభ్యసించింది. గత రాత్రి శ్రీ రామచంద్ర వైద్య కళాశాల స్నాతకోత్సవం నిర్వహించారు. పట్టా అందుకున్న అనంతరం అదితి తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేసింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.... అదితి ఇప్పుడు అఫిషియల్ గా ఓ డాక్టర్ అయినా.... ఆమె వైద్య వృత్తిలో కొనసాగుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఎందుకంటే... అదితి శంకర్ సినిమాల్లో అరంగేట్రం చేస్తోంది. కార్తీ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో వస్తున్న 'విరుమాన్' చిత్రంలో అదితినే హీరోయిన్. ఈ సినిమా తర్వాత అదితికి మరిన్ని చాన్సులు వస్తే ఆమె డాక్టర్ వృత్తిని పక్కనబెట్టి, ఫుల్ టైమ్ యాక్టర్ గా మారడం ఖాయం.
Aditi Shankar
Medicine
Graduation
Shankar
Kollywood

More Telugu News