తెలంగాణలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాప్తి
- గత 24 గంటల్లో 38,467 కరోనా పరీక్షలు
- 207 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 82 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,897 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,77,954 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,70,053 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,897 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించినవారి సంఖ్య 4,004కి పెరిగింది.
