Bothsa sathyanarayana: హైదరాబాదులో బొత్స కుమారుడు సందీప్ నిశ్చితార్థం... తరలి వచ్చిన నేతలు, టాలీవుడ్ తారలు

Bothsa sathyanarayana
  • త్వరలో బొత్స తనయుడు సందీప్ వివాహం
  • కదిరి బాలకృష్ణ కుమార్తె పూజితతో నిశ్చితార్థం
  • పార్క్ హయత్ హోటల్లో వేడుక
  • ఘనంగా నిశ్చితార్థం
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్... కదిరి బాలకృష్ణ కుమార్తె పూజిత నిశ్చితార్థం హైదరాబాదులో జరిగింది. నగరంలోని పార్క్ హయత్ స్టార్ హోటల్లో అత్యంత వేడుకగా జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయనేతలు, టాలీవుడ్ సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు.

ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గంటా శ్రీనివాసరావు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, విడదల రజని తదితరులు విచ్చేశారు. తెలంగాణ మంత్రి హరీశ్ రావు, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కె.కేశవరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ సైతం బొత్స తనయుడి నిశ్చితార్థ కార్యక్రమానికి వచ్చారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మా అధ్యక్షుడు మంచు విష్ణు తదితరులు సందడి చేశారు.
Bothsa sathyanarayana

More Telugu News