Taiwan: కరోనా సోకిన ఎలుక కరవడంతో సైంటిస్టుకు పాజిటివ్

Taiwan Scientist Tested Positive for Covid After Mouse Bite
  • తైవాన్ లోని జీనోమిక్ రీసెర్చ్ ల్యాబ్ లో ఘటన
  • రీసెర్చ్ చేస్తుండగా ఘటన
  • నెల తర్వాత దేశంలో తొలి కరోనా కేసు
ఇప్పటిదాకా మనిషి నుంచి మనిషికి మాత్రమే కరోనా సంక్రమిస్తుందని తేలింది. కరోనా ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా, అతడి లాలాజలాన్ని తాకినా కరోనా సోకుతున్నట్టు తేల్చారు. అయితే, తాజాగా ఎలుక కరిచినా కరోనా సోకుతున్నట్టు తేలింది. తైవాన్ లోని అత్యంత కట్టుదిట్టమైన బయోసేఫ్టీ లెవల్ 3 ప్రమాణాలు కలిగిన అకాడమికా సినికా అనే జన్యుక్రమ విశ్లేషణ సంస్థలో ఈ ఘటన జరిగింది. దాదాపు నెల రోజులుగా ద్వీప దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా ఎలుక కరవడంతో తొలి కేసు నమోదైంది.

  20 ఏళ్ల సైంటిస్ట్ ల్యాబ్ లో పనిచేస్తుండగా.. కరోనా సోకిన ఎలుక కరిచినట్టు తైవాన్ ఆరోగ్య శాఖ మంత్రి చెన్ షీ చుంగ్ ప్రకటించారు. ఆమె ఇటీవలి కాలంలో ఎక్కడికీ ప్రయాణం చేయలేదని, మోడర్నా ఎంఆర్ఎన్ఏ రెండు డోసుల వ్యాక్సిన్ ను కూడా తీసుకుందని చెప్పారు. అయితే, ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఎలుక కరవడం వల్లే కరోనా సోకిందని తేల్చామని, మరిన్ని టెస్టులు చేశాక దానిని నిర్ధారించాల్సి ఉందని ఓ సీనియర్ వైరాలజిస్ట్ చెప్పారు.

కాగా, అకాడమికా సినికాలో జంతువుల్లోని వివిధ వ్యాధి కారక క్రిములను బయటకు తీసి పరిశోధనలను చేస్తుంటారు. టీకా పనితీరు, వాటి ప్రభావం వంటి వాటిని తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే యువ సైంటిస్ట్ కు ఎలుక కరిచిందని అధికారులు చెబుతున్నారు. ఆమెకు డెల్టా వేరియంట్ సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Taiwan
COVID19
Mouse
Delta

More Telugu News