cid: రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ నివాసంలో సీఐడీ సోదాలు.. వీడియో ఇదిగో

ap cid raid in lakshmi narayanas home
  • హైద‌రాబాద్‌లోని ఆయ‌న ఇంట్లో త‌నిఖీలు
  • చంద్రబాబు వ‌ద్ద గ‌తంలో ఓఎస్డీగా లక్ష్మీనారాయణ
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ద్వారా యువతకు శిక్ష‌ణ‌
  • అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు  
హైద‌రాబాద్‌లోని రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ నివాసంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఐడీ సోదాలు జ‌రుపుతోంది. చంద్రబాబు నాయుడి వ‌ద్ద గ‌తంలో లక్ష్మీనారాయణ ఓఎస్డీగా పనిచేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం పదవీ విరమణ తర్వాత కూడా ఏపీ స‌ర్కారుకి లక్ష్మీనారాయణ సలహాదారుగా కొన‌సాగారు.

ఆయ‌న‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ద్వారా యువతకు శిక్ష‌ణ‌ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయ‌నఫై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నేప‌థ్యంలోనే నేడు సోదాలు నిర్వహిస్తున్నారు.      

       
cid
Andhra Pradesh
Hyderabad

More Telugu News