B.Saiteja: సాయితేజ కుటుంబ సభ్యుల బాధ ఎలా ఉందో ఊహించడానికే కష్టంగా ఉంది: నారా లోకేశ్

Nara Lokesh responds to Lance Naik Sai Teja death in helicopter crash
  • తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదం
  • చిత్తూరు జిల్లాకు చెందిన జవాను మృతి
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన లోకేశ్
  • జవాను కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా జవాను సాయితేజ దుర్మరణం పాలవడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కురబల కోట వాసి లాన్స్ నాయక్ బి.సాయితేజ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సాయితేజ ఈ ఉదయం కుటుంబ సభ్యులతో చివరిసారి మాట్లాడినట్టు తెలిసిందని లోకేశ్ వెల్లడించారు.

ఉదయం కుటుంబంతో మాట్లాడిన వ్యక్తి సాయంత్రానికి ఇలా అయిపోయారంటే ఆ కుటుంబ సభ్యుల బాధ ఎలా ఉంటుందో ఊహించడానికే కష్టంగా ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. సాయితేజ... సీడీఎస్ బిపిన్ రావత్ కు వ్యక్తిగత భద్రతాధికారిగా వ్యవహరిస్తూ నేటి ప్రమాదంలో మృత్యువాత పడడం తెలిసిందే.
B.Saiteja
Nara Lokesh
Helicopter Crash
Chittoor District

More Telugu News