Ravichandran Ashwin: ఐసీసీ ర్యాంకింగ్స్ లో అశ్విన్ పైపైకి...!

Ashwin leaps to second spot in ICC rankings
  • తాజా ర్యాంకులు ప్రకటించిన ఐసీసీ
  • ఆల్ రౌండర్ ర్యాంకుల్లో అశ్విన్ 2వ స్థానం
  • ఒక స్థానం ఎగబాకిన తమిళతంబి
  • బౌలింగ్, బ్యాటింగ్ లో రాణిస్తున్న వైనం

కొంతకాలం కిందట టీమిండియాలో చోటే ప్రశ్నార్థకమైన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల కాలంలో అదే ఫార్మాట్లో అదరగొడుతున్నాడు. అటు బౌలింగ్ లోనే కాకుండా, బ్యాటింగ్ లోనూ రాణిస్తూ ఆల్ రౌండర్ గా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు.

ఇటీవల న్యూజిలాండ్ తో రెండు టెస్టుల సిరీస్ లోనూ విశేషంగా రాణించిన అశ్విన్... ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో పైకి ఎగబాకాడు. టీమిండియా సహచరుడు రవీంద్ర జడేజాను కిందికినెట్టిన అశ్విన్ 360 రేటింగ్ పాయింట్లతో రెండోస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ (382) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో బెన్ స్టోక్స్, నాలుగో స్థానంలో రవీంద్ర జడేజా ఉన్నారు.

  • Loading...

More Telugu News