Balakrishna: తగ్గని 'అఖండ' జోరు.. ప్యారిస్ లో ప్రత్యేక షోకు సర్వం సిద్ధం!

Balakrishnas Akhanda movie special show in Paris
  • బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న 'అఖండ'
  • వంద కోట్ల క్లబ్ దిశగా బాలయ్య సినిమా
  • ప్యారిస్ లో ఈ రాత్రికి స్పెషల్ షో
నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా ఘన విజయాన్ని సాధించింది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబడుతున్న చిత్రంగా కొనసాగుతోంది. వంద కోట్ల క్లబ్ లో చేరే దిశగా అడుగులు వేస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగువారు ఎక్కువగా ఉందే విదేశాల్లో సైతం భారీ కలెక్షన్లను రాబడుతోంది. మామూలుగా బాలయ్య సినిమాలు అమెరికాలో పెద్ద ఎత్తున విడుదలవుతాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు యూఎస్ తో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, యూఏఈల్లో కూడా 'అఖండ' సందడి చేస్తోంది.

తాజాగా ఇతర దేశాల్లో ఉంటున్న వారు కూడా డిమాండ్ చేస్తుండటంతో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో 'అఖండ' ప్రత్యేక షో వేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. ప్యారిస్ లోని పాథే లా విల్లెట్ థియేటర్ లో 'అఖండ' షో వేసేందుకు నిర్మాతలు సర్వం సిద్ధం చేశారు. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 7.45 గంటలకు స్పెషల్ షో వేస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా కొనసాగుతున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ ప్రధాన పాత్రలను పోషించారు.
Balakrishna
Akhanda
Tollywood
France
Paris
Special Show

More Telugu News