Samantha: 'యశోద' షూటింగ్ ప్రారంభం... సమంత ప్రధాన పాత్రలో పాన్ ఇండియా చిత్రం

Samantha as Yashoda shooting begins
  • తొలిసారిగా పాన్ ఇండియా చిత్రంలో సమంత
  • శ్రీదేవి మూవీస్ బ్యానర్లో 'యశోద'
  • దర్శకద్వయం హరి-హరీశ్ కు ఇదే తొలి చిత్రం
  • ఐదు భాషల్లో 'యశోద' నిర్మాణం 
ఇటీవల కాలంలో సమంత జోరు పెంచింది. విభిన్న తరహా పాత్రలు అంగీకరిస్తూ నటనకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటోంది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో పాన్ ఇండియా చిత్రం 'యశోద' నేడు సెట్స్ పైకి వెళ్లింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంతో దర్శక ద్వయం హరి-హరీశ్ వెండితెర అరంగేట్రం చేస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ 'యశోద' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Samantha
Yashoda
Pan India Film
Hari-Harish

More Telugu News