Invisible Force: అదృశ్య శక్తి నా ఆహారాన్ని తినేస్తోంది.. మహిళా ఇంజినీర్ ఫిర్యాదుతో పోలీసుల షాక్!

Invisible Forces Stealing From Me Madhya Pradesh Engineer Calls Cops
  • మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఘటన
  • అదృశ్య శక్తి తన దుస్తులు, నగలు కాజేస్తోందని ఆరోపణ
  • ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించిన పోలీసులు
  • త్వరలోనే సైకియాట్రిస్ట్‌తో కౌన్సెలింగ్
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా ఇంజినీర్ చేసిన ఫిర్యాదుతో పోలీసులు షాకయ్యారు. దాని నుంచి వారు ఇంకా తేరుకోలేకపోతున్నారు. బేతుల్ జిల్లాకు చెందిన సదరు మహిళ ప్రధానమంత్రి రూరల్ రోడ్ మిషన్‌లో సబ్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఇటీవల కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె పోలీసులకు విచిత్రమైన ఫిర్యాదు చేశారు.

ఏదో అదృశ్య శక్తి  తన దుస్తులు, నగలు కాజేస్తోందని, తన నగల బరువును కూడా తగ్గిస్తోందని ఫిర్యాదు చేశారు. అంతేకాక, తన ఆహారాన్ని కూడా అది తినేస్తోందని వాపోయారు. నాలుగైదు రోజులుగా ఇలాగే జరుగుతోందని, కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె కోరారు.

సబ్ ఇంజినీర్ ఫిర్యాదుపై స్పందించిన పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ రత్నాకర్ హింగ్వే మాట్లాడుతూ.. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించామన్నారు. ఆమె చెబుతున్నట్టుగా ఎలాంటి అదృశ్య శక్తులు లేవన్నారు. కౌన్సెలింగ్ కోసం ఆమెను మానసిక వైద్య నిపుణుడి వద్దకు పంపుతామని చెప్పారు.
Invisible Force
Madhya Pradesh
Betul

More Telugu News