Omicron: మహారాష్ట్రలోనూ ఒమిక్రాన్... విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి కొత్త వేరియంట్ నిర్ధారణ

Omicron case emerges in Maharashtra
  • భారత్ లో క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
  • విదేశాల నుంచి కల్యాణ్ డోంబీవాలి ప్రాంతానికి వచ్చిన వ్యక్తి
  • వైద్య పరీక్షల్లో ఒమిక్రాన్ పాజిటివ్
  • దేశంలో 4కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు
భారత్ లో క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని మహారాష్ట్ర ప్రభుత్వ వైద్య విభాగం డైరెక్టర్ వెల్లడించారు. అతడు విదేశాల నుంచి ముంబయి సమీపంలోని కల్యాణ్ డోంబీవాలి మున్సిపల్ ఏరియాకు వచ్చాడని తెలిపారు.

ఈ కేసుతో భారత్ లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఇటీవల బెంగళూరులో రెండు కేసులు నమోదు కాగా, నేడు గుజరాత్ లోని జామ్ నగర్ లో మరో కేసు వెల్లడైంది.
Omicron
Maharashtra
Positive
Corona New Variant

More Telugu News