Virat Kohli: ముంబై టెస్టులో కోహ్లీ డకౌట్.. స్కిప్పర్ ఖాతాలో రెండు చెత్త రికార్డులు!

Virat Kohli registered two unwanted records after mumbai duck
  • వివాదాస్పద ఔట్‌కు వెనుదిరిగిన కోహ్లీ
  • అత్యధికసార్లు డకౌట్ అయిన ఇండియన్ కెప్టెన్‌గా కోహ్లీ పేరు
  • స్వదేశంలో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాడిగా మరో చెత్త రికార్డు
టీమిండియా రన్ మెషీన్‌గా పేరు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ ఖాతాలో రెండు చెత్త రికార్డులు వచ్చి చేరాయి. న్యూజిలాండ్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు ఆడిన కోహ్లీ కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ వేసిన బంతికి వివాదాస్పద రీతిలో పెవిలియన్ చేరాడు. అజాజ్ వేసిన బంతి బ్యాట్‌కు తాకినట్టు రీప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తొలుత ఫీల్డ్ అంపైర్, ఆ తర్వాత టీవీ అంపైర్ అవుట్‌గా ప్రకటించడపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడా నిపుణులు, మాజీ ఆటగాళ్లు అంపైర్ల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.

నిన్నటి డకౌట్‌తో కోహ్లీ టెస్టుల్లో రెండు చెత్త రికార్డులను మూటగట్టుకున్నాడు. అందులో ఒకటి.. కెప్టెన్‌గా టెస్టుల్లో పదిసార్లు డకౌట్ కావడం. ఇంగ్లండ్ పర్యటనలో డకౌట్ అయిన కోహ్లీ 8 డకౌట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రికార్డును అధిగమించాడు. తాజా డకౌట్‌తో అత్యధికసార్లు డకౌట్‌ అయిన ఇండియన్ కెప్టెన్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇక, ఓవరాల్‌గా చూసుకుంటే కివీస్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరుపై ఈ రికార్డు ఉంది. కెప్టెన్‌గా ఫ్లెమింగ్ 13 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ రెండో స్థానంలో ఉండగా, మైఖేల్ అర్ధర్‌టన్, హాన్సీ క్రానే.. ధోనీతో కలిసి మూడో స్థానాన్ని పంచుకున్నారు.

కోహ్లీ ఖాతాలో చేరిన మరో చెత్త రికార్డు.. స్వదేశంలో అత్యధికసార్లు డకౌట్ కావడం. స్వదేశంలో కోహ్లీ టెస్టుల్లో ఆరుసార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. నిన్నటి మ్యాచ్ ప్రారంభానికి ముందు మాజీ ఆటగాడు ఎంఏకే పౌటౌడీతో కలిసి టాప్ స్పాట్‌ను పంచుకున్న కోహ్లీ.. ముంబై టెస్టులో డకౌట్‌తో పటౌడీని వెనక్కి నెట్టేశాడు.
Virat Kohli
Team India
Team New Zealand
Duck Out
Unwanted Record

More Telugu News