Devineni Uma: దేవినేని ఉమ తండ్రి మృతి.. చంద్రబాబు నివాళి

Chandrababu pays tributes to Devineni Uma fater
  • గుండెపోటుతో దేవినేని శ్రీమన్నారాయణ మృతి
  • దేవినేని ఉమను పరామర్శించిన చంద్రబాబు
  • కంచికచర్లలో అంత్యక్రియలకు ఏర్పాట్లు
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ తుదిశ్వాస విడిచారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. శ్రీమన్నారాయణ వయసు 88 సంవత్సరాలు. ఆయన స్వగ్రామం కంకిపాడు మండలం నెప్పల్లి అయినప్పటికీ... కంచికచర్లలో స్థిరపడ్డారు. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. క్రియాశీలక రాజకీయాల్లో ఆయన లేనప్పటికీ... తన కుమారులు దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఎన్నోసార్లు పాల్గొన్నారు. ఆయన అంత్యక్రియలను కంచికచర్లలో నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు.

మరోవైపు దేవినేని ఉమ నివాసం వద్దకు టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. శ్రీమన్నారాయణకు నివాళి అర్పించారు. దేవినేని ఉమను, కుటుంబసభ్యులను ఓదార్చారు.
Devineni Uma
Father
Dead
Telugudesam
Chandrababu

More Telugu News