Goat: ప్రభుత్వ కార్యాలయంలో ఫైలును తీసుకెళ్లిన మేక... లబోదిబోమన్న అధికారులు

Goat took file and ran away in a govt office
  • యూపీలో ఘటన
  • కాన్పూర్ లో ప్రభుత్వ ఆఫీసులో ప్రవేశించిన మేక
  • బల్లపై ఉన్న ఫైలును నోట కరుచుకున్న వైనం
  • మేక వెంట పరుగులు తీసిన సిబ్బంది
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఆసక్తికర ఘటన జరిగింది. అక్కడి ప్రభుత్వ కార్యాలయంలో ప్రవేశించిన ఓ మేక అందరినీ పరుగులు పెట్టించింది. ఆఫీసులో బల్లపై ఉన్న ఓ ఫైలును మేక తీసుకెళ్లడంతో అధికారులు లబోదిబోమన్నారు. అక్కడి సిబ్బంది ఆ ఫైలును తిరిగి తీసుకువచ్చేందుకు మేక వెంట పడ్డారు. అది పరుగులు తీయడంతో వారు కూడా దాంతో పాటు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Goat
File
Govt Office
Kanpur
Uttar Pradesh

More Telugu News