APSRTC: పండుగ ప్రయాణికులకు శుభవార్త.. ముందస్తు రిజర్వేషన్ గడువును పొడిగించిన ఏపీఎస్ ఆర్టీసీ

APSRTC Extended another 30 days to reserve ticket
  • ప్రస్తుతం 30 రోజుల ముందు రిజర్వు చేసుకునే అవకాశం
  • దీనిని మరో 30 రోజులు పెంచిన ఏపీఎస్ ఆర్టీసీ
  • దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సులకు వర్తింపు
క్రిస్మస్, సంక్రాంతికి ఊరెళ్లాలనుకునే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తు రిజర్వేషన్ గడువును మరో నెల రోజులు పొడిగించింది. ప్రస్తుతం 30 రోజుల ముందు మాత్రమే టికెట్ రిజర్వు చేసుకునే అవకాశం ఉండగా, ఇకపై మరో 30 రోజుల ముందు అంటే 60 రోజుల ముందుగానే టికెట్ రిజర్వు చేసుకోవచ్చు.

దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సులకు ఇది వర్తిస్తుందని, రేపటి నుంచే ఇది అమల్లోకి వస్తుందని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
APSRTC
Andhra Pradesh
Festivals
Sankranti

More Telugu News