Praveen Kumar: వరి కల్లంలో కూలి పని చేసి రూ.100 సంపాదించిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్

Former IPS Praveen Kumar earned hundred rupees by doing labor work
  • ప్రజాసేవ కోసం ఉద్యోగం వదులుకున్న ప్రవీణ్ కుమార్
  • ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆసక్తి
  • తాజాగా నల్గొండ జిల్లాలో పర్యటన
  • వడ్ల బస్తాలు మోసిన వైనం
ప్రజా సేవకు ఉద్యోగంతో పనిలేదని భావించి పదవీవిరమణ ప్రకటించిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు.

తాజాగా నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో పర్యటించారు. అక్కడ ఓ వరి కల్లంలో కూలి పనిచేశారు. వడ్ల బస్తాలు మోసి రూ.100 సంపాదించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదోయ్ అంటూ స్పందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు.
Praveen Kumar
Former IPS
Labor Work
Narketpally
Nalgonda District
Telangana

More Telugu News