Andhra Pradesh: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్లపై ప్రభుత్వ కన్ను: గోరంట్ల

Govt Trying to grab NTR Health Varsity Funds Accuses Gorantla
  • ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా మళ్లించే కుట్ర
  • యూనివర్సిటీల సొమ్ముతో ప్రభుత్వ సోకులు
  • అప్పుల ఊబిలో రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం కన్ను తాజాగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్లపై పడిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. డబ్బుల్లేక ప్రభుత్వం అప్పుల ఊబిలో చిక్కుకుపోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ వర్సిటీ డబ్బును రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు మళ్లించేందుకు దుష్ట ఆలోచన చేసిందని విమర్శించారు.

కెనరా బ్యాంకులో దాచిన డబ్బును ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా యూనివర్సిటీల అభివృద్ధికి దాచిన సొమ్ముతో ప్రభుత్వం సోకులు చేస్తాననడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు.
Andhra Pradesh
Telugudesam
Gorantla Butchaiah Chowdary

More Telugu News