CM Jagan: తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను సందర్శించిన సీఎం జగన్... ఫొటోలు ఇవిగో!

CM Jagan visits Goshala near his residence in Tadepally
  • తాడేపల్లిలో గోశాల నిర్మాణం
  • చెవిరెడ్డితో కలిసి గోశాలలో కలియదిరిగిన సీఎం జగన్
  • ఆసక్తిగా పరిశీలించిన వైనం
  • సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు
తాడేపల్లిలో సీఎం జగన్ నివాసం వద్ద నూతనంగా గోశాలను నిర్మించారు. ఈ గోశాలను సీఎం జగన్ సందర్శించారు. సీఎం వెంట వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. గోశాలలో ప్రవేశించిన సీఎం జగన్ గోవుల కోసం చేసిన ఏర్పాట్లను ఆసక్తిగా పరిశీలించారు. గోమాతల వద్దకు వెళ్లి వాటిని ఆప్యాయంగా నిమిరారు.

కాగా, ఇక్కడి గోశాలలో పలు జాతులకు చెందిన గోవులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. సీఎం జగన్ సందర్శనకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
CM Jagan
Goshala
Tadepally
YSRCP
Sri Lanka

More Telugu News