దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా.. అది ఒమిక్రానేనా?
- ఈ నెల 24న దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి
- బాధితుడిని ఐసోలేషన్ చేసిన కేడీఎంసీ అధికారులు
- జినోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలు
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన బాధితుడు ఈ నెల 24న ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడి నుంచి ముంబైకి వచ్చాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని కేడీఎంసీ ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రతిభా పన్‌పాటిల్ తెలిపారు. బాధితుడి సోదరుడికి మాత్రం కరోనా నెగటివ్ అని తేలిందన్నారు. అతడి కుటుంబ సభ్యులకు నేడు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కాగా, బెంగళూరులో వెలుగు చూసిన రెండు కేసులు ఒమిక్రాన్ కాదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.