Team India: రెండో ఇన్నింగ్స్ ను 234/7 వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా... న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్

Team India declared second innings in Kanpur test
  • కాన్పూర్ లో టీమిండియా వర్సెస్ కివీస్
  • రాణించిన అయ్యర్, సాహా
  • ఆటకు రేపు ఆఖరిరోజు
  • గెలుపుపై ధీమాతో ఉన్న టీమిండియా
కాన్పూర్ టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 234/7 వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా న్యూజిలాండ్ కు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ లో శ్రేయాస్ అయ్యర్ 65 పరుగులు చేయగా, వృద్ధిమాన్ సాహా 61 (నాటౌట్) పరుగులు సాధించాడు. అశ్విన్ 32, అక్షర్ పటేల్ 28 (నాటౌట్) పరుగులు చేశాడు.

భారత్ లో ఇప్పటివరకు ఏ విదేశీ జట్టు కూడా రెండో ఇన్నింగ్స్ లో 276 కంటే ఎక్కువ పరుగులు ఛేదించిన దాఖలాలు లేవు. ఆ ధీమాతోనే టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసినట్టు తెలుస్తోంది. తమ స్పిన్నర్లపై నమ్మకం ఉంచిన కెప్టెన్ రహానే... రెండో ఇన్నింగ్స్ లో అక్షర్ పటేల్, అశ్విన్ లకు కొత్తబంతిని అప్పగించాడు. తొలి ఇన్నింగ్స్ లో అక్షర్ 5 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీయడం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లోనూ వీరిద్దరూ సత్తా చాటితే కివీస్ విలవిల్లాడడం ఖాయం. కాగా ఆటకు రేపు ఆఖరిరోజు.
Team India
Second Innings
New Zealand
Kanpur Test

More Telugu News